logo

ఎవరు ఊహించని వింత ఆచారాలు..


11-Aug-2019 11:45IST
Who unexpected strange rituals

మాములుగా ఆచారాలు అనేవి దేశ సాంస్కృతిని పెంపొందించేలా ఉంటాయి.. కానీ, కొన్ని దేశాలలో ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అది ఎలాగంటే ఇవి మీరు కనుక చేసుకుంటే మీరు బ్రతుకుతారు లేకుంటే మీ జీవితం కష్టాల్లో పడుతుంది అనే అంతగా నమ్మే మూడాచారాలను కలిగి ఉంటారు. ఆశ్చర్యాన్ని కలిగించే ఆ ఆచారాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకు వాళ్ళు వీటిని ఆచారాలుగా పెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాము..

కత్తితో చర్మాన్ని కోయడం :

కత్తితో చర్మాన్ని కోయడం ..ఇదేం వింత అనుకుంటున్నారా ..అవునండి ఇలాంటి ఆచారం కూడా ఉంది. వెస్ట్ ఆఫ్రికాలో ఒక తెగ వాళ్ళు ఎలా చేస్తారట. పిల్లలు పాలు తాగడం ఆపేసినప్పటి నుండి ఆ ఆచారం ఉంటుందంట.చిన్న పిల్లలకు కత్తితో మొహం మీద గాట్లు పెడతారంట. ఒక్క సారి , రెండు సార్లు కాదండి ఏకంగా ముప్పై నిమిషాలు ఈ గాట్లు పెడతారట. ఇక పెళ్లి కావాల్సిన మగవాళ్లకు వాళ్ళ పొట్టపై గాట్లు పెడతారంట.ఈ భాదను భరించిన వాళ్ళు , జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొంటారని వాళ్ళ నమ్మకం.ఇదేం ఆచారమే మనకైతే లేదు సంతోషం..

పెళ్లి చేసుకోబోయే మగవాళ్ళు చీమలతో కుట్టిపించుకోవడం:

అమెజాన్ ప్రాంతాల్లో గిరిజన తెగల ఆచారం ఇది ...పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు బుల్లెట్ యాంట్లతో కుట్టిపిచుకోవడం. అది ఎలాగాంటే ..గ్లౌజ్ వంటి వాటిలో వందకు పైగా చీమలు ఉంచి వాటిలో చేతులను ఉంచి పది నిమిషాలు కుట్టిపిచుకోవాలి. అలా రోజులో ఆరు సార్లు కుట్టిపిచుకోవాలట.అవి చాలా పవర్ ఫుల్ చీమలు వీటి భాదను భరిస్తే జీవితంలో బాధ పెట్టె బాధలు భరిస్తారని వారి నమ్మకం.

చనిపోయిన వాళ్ళను ఆహారంగా తీసుకోవడం:

యనమామి అనే ఒక గిరిజన తెగ వాళ్లకు ఓ వింత ఆచారం ఉంది.అది ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళను కట్టెల మీద కాల్చి , కాలిన ఎముకలను తీసుకొని సూప్ చేసుకొని తాగుతారంట.మనిషిని మనిషి సాధించడం చూసాము కానీ , మనిషిని మనిషి ఆహారంగా తీసుకోవడం వింతే అని చెప్పాలి.ఇలా అమెజాన్ ప్రాంతాల్లో ఇప్పటికి  కూడా జరుగుతాయట. పిచ్చి ఉండాలి గాని మనిషిని పీక్కు తినే అంత ఉండకూడదు.

పుకత్ వెజిటేరియన్ పండుగ :

పుకాత్ అనే ప్రాంతం చైనాలో ఉంటుంది.ఈ ప్రాంతంలో అక్టోబర్ మాసంలో ఓ పండుగ చేస్తారు. ఆ పండుగ ఎందుకంటే ..మాంసాహారం మానేస్తున్నాము అనుకొనే వాళ్ళు వాళ్ళ దేవుడి దగ్గర కెళ్ళి రెండు దవడలు పెద్ద పెద్ద సూలాలను గుచ్చుకుంటారంట . అలా చిన్నా , పెద్ద , ఆడ , మగా తేడా లేకుండా చేయడం అక్కడి వింత ఆచారం.

సుర్మాలిప్ డిస్క్ :

అమెజాన్ సుర్మా అనే తెగ అమ్మాయిలకు వాళ్ళ లిప్ సైజు ను బట్టి వారికి డిమాండ్ అనేది ఉంటుందట.దాని కోసం అమ్మాయిలకు చిన్న గా కింద పెదవిని కత్తిరించి ,దానిలో ఒక చెక్క డబ్బా పెడతారు . అలా కొద్దినెలల ఉంచుతారు. వారి కింద పెదవి రెండు సెంటీమీటర్ల నుండి నాలుగు సెంటీమీటర్ల వరకు పెరుగుతుందట. అలా ఎవరికైతే పెద్దగా ఉంటుందో వాళ్లకు అబ్బాయిలు ఎదురుకట్నం ఇస్తారు. లిప్ డిస్క్ కాస్త రిస్క్ అయినా కూడా ఎదురు కట్నం ఇవ్వడం అనేది బాగుందనే చెప్పాలి..

ఇలా చాలా వింత సాంప్రదాయాలు , ఆచారాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి.. 

Tags: different cultures wonder cultrues horrible cultures

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top